అమలాపురంలో ఘనంగా చెడీ తాలింఖానా: ఒళ్లు గగుర్పొడిచే ప్రాచీన యుద్ధ విన్యాసాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమలాపురం
అమలాపురంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన చెడీ తాలింఖానా యుద్ధ విద్యల ప్రదర్శనలకు సర్వం సిద్ధమైందని నిర్వాహకులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఏడు వీధుల యువకులు కత్తిసాము, కర్రసాము వంటి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో పట్టణ వీధులను రణవేదికలుగా మారుస్తారని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి 1856 నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ ప్రాచీన కళను కాపాడుతూ నేటికీ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా సాధన చేయడం విశేషమని వారు వెల్లడించారు.