చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమాపై స్పష్టతనిచ్చిన ప్రముఖ దర్శకుడు బోయపాటి
రిపోర్టర్: రాము
స్థలం: తిరుమల
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తానని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు అగ్ర హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథ సిద్ధం చేసి తెరకెక్కించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణతో అఖండ మూడు సినిమా ఉంటుందని వెల్లడించారు.