కేంద్రం అండతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని సీఎం చంద్రబాబు వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా సాగుతోందని, డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా రామాపురంలో పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. పల్లె పండుగ కింద పదకొండ వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చామని, కష్టాలను తట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.