నదుల ప్రక్షాళనకు నడుం బిగించిన యువకుడు బిట్టు తబాహి

రిపోర్టర్: గోపి స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని ఒంటరిగా స్వచ్ఛంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ అయిన 20 ఏళ్ల బిట్టు తబాహికి నెదర్లాండ్స్‌కు చెందిన 'ది ఓషన్ క్లీనప్' సంస్థ నుంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే, దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లి నదులను శుభ్రం చేయాలో తెలపాలని ఆయన తన ఫాలోవర్లను కోరారు. ఆయన చేసిన ఈ సామాజిక సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.