తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ (IMD Hyderabad - తెలంగాణ వాతావరణ సూచనలు & వర్ష హెచ్చరికలు) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.