కనిగిరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు: కేవలం ఒక్కటే దాఖలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Kanigiri

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో తొలిరోజు అత్యంత మందకొడిగా సాగింది. మొత్తం ముప్పై రెండు వార్డులకు గాను తొలిరోజు కేవలం పదో వార్డులో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. అకాల భారీ వర్షం కారణంగా అభ్యర్థులు కార్యాలయానికి రాలేకపోయారని, రాబోయే రోజుల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.