రూ.28 వేల కోట్లతో ఉడాన్ పథకానికి కేంద్రంతో ఒప్పందం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
కొత్త నిబంధనలతో ఉడాన్ పథకం అమలుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం మధ్య దిల్లీలో మంగళవారం ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఏడీసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య సంతకం చేశారు. పదేళ్ల కాలపరిమితితో అమలయ్యే ఈ పథకం కింద కేంద్రం రూ.28,840 కోట్లు వెచ్చించనుందని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.