కృష్ణా నదీ తీరంలో కుప్పలుగా కాలం చెల్లిన మందులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: కృష్ణా

కృష్ణా జిల్లా యనమలకుదురు వద్ద కృష్ణా నదీ తీరంలో కాలం చెల్లిన మందులు కుప్పలుగా పేరుకుపోయాయి. రాత్రివేళ స్థానిక మందుల దుకాణదారులు వీటిని పారేస్తున్నారు. మేతకు వచ్చే పశువులు వీటిని తిని అనారోగ్యపాలవుతున్నాయి. ఈ మందులు భూగర్భ జలాల్లోకి చేరి నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుంది.