కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 50 వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదు

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పదేళ్లలో 50 వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదని, తమ ప్రభుత్వం మాత్రం 50 వేల ఆధునిక రైలు కోచ్‌లను తయారు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను యువత నమ్మే పరిస్థితి లేదని, యంగ్ ఇండియా చైతన్యవంతంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు.