స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీన నిర్ణయం రద్దు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు అధ్యాపకులు 38 రోజులుగా సాగించిన పోరాటం ఫలించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలు, శక్తి శాఖలో ఉద్యోగుల విలీనం చేస్తూ తెచ్చిన జీవో 97 నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు స్పష్టం చేశారు. సాంకేతిక విద్యాశాఖ యథాతథంగా కొనసాగుతుందని, డిప్లొమా కోర్సులు, పరీక్షా విధానం పాత పద్ధతిలోనే ఉంటాయని ప్రకటించడంతో విద్యార్థుల పోరాటానికి విజయవంతంగా తెరపడింది.