అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రిషితను పరామర్శించిన మంత్రి సీతక్క

రిపోర్టర్: గోపి స్థలం: హనుమకొండ

హనుమకొండ రెడ్డి కాలనీలో ప్రాణాంతక డీఎండీ అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న రిషిత అనే చిన్నారిని మంత్రి సీతక్క నేరుగా వెళ్లి పరామర్శించారు. చిన్నారితో సెల్ఫీ దిగి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. నాలుగు కోట్ల మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధితో బాధపడుతున్న బాలిక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో రిషితకు ఉచితంగా మెరుగైన వైద్యం అందేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హామీ ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు.