రైతాంగ క్షేమమే పరమావధిగా శ్రమించాలని పొన్నం ప్రభాకర్ పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిగురుమామిడి

హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల నూతన ప్యాక్స్ చైర్మన్ చిట్టుమల్ల రవీందర్, పాలకమండలి సభ్యులు హైదరాబాద్లోని నివాసంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు అవకాశం కల్పించినందుకు మంత్రికి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగ సంక్షేమమే పరమావధిగా, సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి ప్రగతికి తోడ్పడాలని, రైతు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలని కోరారు.