మనుబోలు పశువుల సంత వేలం పాటలో రికార్డు ధర
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య మరియు పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పశువుల సంత వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాట హోరాహోరీగా సాగి చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి రూ. 81,10,000 లకు దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం పాట పలకడం స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.