కోల్‌కతాలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన: 40 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పశ్చిమ బెంగాల్
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ జరిపిన తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కుళ్లిన ఆహారం, బొద్దింకలు, ఎలుకలు ఉన్న 40 రెస్టారెంట్లు మరియు హోటళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. సుమారు 1,224 కిలోల నాణ్యత లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేసి, 112 సంస్థలకు నోటీసులు జారీ చేశారు.