బెల్లంపల్లి పట్టణంలో మోడి క్యాంటీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని అరవై ఐదు డీప్ ఏరియాలో మోడి క్యాంటీన్ నల్లుల సంగీత ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు, చిన్నారులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్క ఆడపడుచు ఉత్సాహంగా పాల్గొని పరస్పరం సంతోషాలను పంచుకుంటూ బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో విజయవంతం చేశారు.