బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును అరెస్ట్ చేసిన పోలీసులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి తప్పుగా మాట్లాడలేదని, కేవలం ఆత్మరక్షణ ధోరణిలోనే స్పందించానని తాతా మధు వివరణ ఇచ్చారు.