పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసానికి కేటీఆర్ సెల్యూట్
రిపోర్టర్: విజయ్
స్థలం: రాజన్న సిరిసిల్ల
పైలట్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన అసాధారణ సాహసాన్ని కొనియాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ ప్రమాదకర ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన నివేదిక ఆధారంగా పైలట్ చూపిన తెగువను ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధ్యతలు నిర్వర్తించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు.