'తాగునీరు ఇవ్వకపోతే ఎలా బతకాలి?': మధురవాడ గేటెడ్ కమ్యూనిటీ వాసుల ఆవేదన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా మధురవాడ ప్రాంతంలోని ఓ భారీ గేటెడ్ కమ్యూనిటీలో బల్క్‌ వాటర్‌ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో వందలాది కుటుంబాలు తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం, అనుమతుల జాప్యం కారణంగా బోర్లన్నీ ఎండిపోయి నివాసితులు అల్లాడిపోతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నప్పటికీ రోజువారీ అవసరాలకు నానా ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే బల్క్‌ వాటర్‌ కనెక్షన్‌ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.