ఒలింపిక్ స్వర్ణమే నా లక్ష్యమంటున్న స్టార్ షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారతీయ స్కీట్ షూటింగ్ దిగ్గజం మైరాజ్ అహ్మద్ ఖాన్ తన నాలుగో ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒలింపిక్ స్వర్త పతకమే తన అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. యాభై ఏళ్ల వయసులోనూ పట్టుదలతో ముందుకు సాగుతున్న ఆయన, గతంలో క్రికెట్ పై మక్కువ పెంచుకున్నప్పటికీ కుటుంబ నేపథ్యంతో షూటింగ్ వైపు వచ్చి దేశానికి అనేక రికార్డులు అందించారు. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ విభాగంలో పాల్గొంటున్న మైరాజ్, ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచే వరకు విశ్రమించేది లేదని దీమా వ్యక్తం చేశారు.