జిల్లా స్థాయి సెమినార్ కు ఎంపికైన కింతలి విద్యార్థి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పొందూరు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలo కింతలి లో గల పి ఎల్ ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కంచరాన కీర్తన మండల స్థాయి సెమినార్ పోటీల్లో సత్తా చాటారు. ఈరోజు పొందూరులో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైడి సూర్యరావు తెలిపారు. ఈనెల ఇరవై ఒకటో తేదీన శ్రీకాకుళంలో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో కీర్తన పాల్గొంటుందని ఉపాధ్యాయులు అభినందించారు.