ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే లోకం మాధవి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే లోకం మాధవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.