సినీ లోకంలో సంచలనం: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లిపై క్లారిటీ

రిపోర్టర్: రమేష్ స్థలం: చెన్నై

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నట్లు నటుడు వైజీ మహేంద్రన్ వెల్లడించారు. వీరిద్దరూ త్వరలోనే ఒక్కటి కానున్నారని, ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఇందుకు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. గత కొంతకాలంగా వస్తున్న డేటింగ్ పుకార్లకు ఈ వ్యాఖ్యలతో మరింత బలం చేకూరింది.