వాల్ స్ట్రీట్ లో భారీ కుదుపు: ఒక్కరోజే లక్షల కోట్ల నష్టం
రిపోర్టర్: నరేష్
స్థలం: New York
అమెరికా స్టాక్ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు భయాలు తీవ్ర కలకలం రేపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఎన్విడియా, ఏఎండీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో నాస్డాక్ ఇండెక్స్ ఒక్కరోజే ఊహించని స్థాయిలో నష్టాలను చవిచూసింది. డేటా సెంటర్ల నిర్మాణాలపై పెరుగుతున్న రాజకీయ అడ్డంకులు, వ్యయాలపై పెట్టుబడిదారుల్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.