ఆసియా క్రీడలకు సర్వం సిద్ధం చేసుకున్న లాంగ్ జంప్ స్టార్ శైలి సింగ్
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
ఆసియా క్రీడల మహిళల లాంగ్ జంప్ పోటీల్లో పతకం సాధించేందుకు భారత స్టార్ అథ్లెట్ శైలి సింగ్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ టోర్నీ కోసం పూర్తిగా ఆరోగ్యంగా బరిలోకి దిగుతున్నానని, గతంలో వేధించిన గాయాల నుంచి కోలుకుని మెరుగైన ప్రదర్శన కనబరచడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. అంజు బాబీ జార్జ్ అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.