రాబోయే కాలంలో ఐదు వేల డాలర్లకు పసిడి ధర
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్డ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మన్‌ప్రీత్ గిల్ అంచనా వేశారు. రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఔన్సు బంగారం ధర ఐదు వేల డాలర్లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలరు బలహీనపడటం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతాయని ఆయన స్పష్టం చేశారు. భారతీయ మార్కెట్లపై సానుకూల దృక్పథం ఉందని ఆయన పేర్కొన్నారు.