ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చమిండా వాస్ నియామకం
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ పేసర్ చమిండా వాస్ నియమితులయ్యారు. రాబోయే సీజన్ కోసం కోచింగ్ సిబ్బందిని ప్రక్షాళన చేస్తున్న ఫ్రాంచైజీ, జహీర్ ఖాన్ మరియు అనిల్ కుంబ్లేలను సంప్రదించినప్పటికీ చర్చలు ఫలించలేదు. ఇప్పటికే యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా, ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.