హార్ముజ్ జలసంధిలో ఘోరం: తొమ్మిది రోజుల్ లో పదకొండు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత తొమ్మిది రోజుల్ లో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పదకొండు ఆయిల్ ట్యాంకర్లు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. అనధికారిక మార్గంలో వెళ్తూ నావల్ మైన్లను ఢీకొనడం వల్లే ఈ నౌకలు పేలిపోయాయని, కొన్ని మునిగిపోయాయని అధికారులు స్పష్టం చేశారు. రాడార్లకు చిక్కకుండా ట్రాన్స్పాండర్లను నిలిపివేసి రహస్యంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ భారీ ప్రమాదాలు సంభవించినట్లు తెలిపారు.