రామాయణ సినిమా ప్రపంచ ప్రీమియర్: అమెరికాలో ఘనంగా ప్రదర్శనకు ఏర్పాట్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27న అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శన జరగనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. హాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరుకానుండటంతో భారతీయ సినీ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని నిర్వాహకులు తెలిపారు.