ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కోసం పెరుగుతున్న మద్దతు

రిపోర్టర్: శివ స్థలం: న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశాల్లో భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాలు మద్దతు ప్రకటించాయి. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.