పిల్లల్లో కంటి చూపు లోపాలను గుర్తించే సరికొత్త సీవీఐ మార్గదర్శకాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
పిల్లల మెదడులో దృశ్య సమాచారాన్ని విశ్లేషించే భాగాల్లో లోపం తలెత్తడం వల్ల కలిగే సెరెబ్రల్ విజువల్ ఇంపెయిర్మెంట్ సమస్యను ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య సంస్థ పరిశోధకులు డాక్టర్ బ్యూలా క్రిస్టీ, డాక్టర్ రమేష్ కెకున్నాయ సరికొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంక్లిష్ట లోపంపై సరైన అవగాహన కల్పించి, పిల్లలకు సకాలంలో పునరావాసం అందించేందుకు ఈ నూతన ప్రోటోకాల్ ఎంతగానో దోహదపడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.