భూభారతి రీసర్వే పరిశీలన: అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

రిపోర్టర్: కిరణ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడులో భూభారతి పైలట్ ప్రాజెక్టు రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి భూమి వివరాలను రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లబండబోడు పరిధిలో పద్నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల భూమిలో సర్వే జరుగుతోందని తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.