పెడనలో నీరు లేక వినాయక నిమజ్జనాలకు తీవ్ర అవస్థలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Pedana, Krishna District
కృష్ణా జిల్లా పెడనలో విఘ్నేశ్వర నిమజ్జనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బంటుమిల్లి కాలువలో నీరు లేకపోవడంతో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిలో మునగకుండా పైకి కనిపిస్తున్నాయి. సరైన నీటి వసతి లేక భక్తులు, నిర్వాహకులు నిమజ్జన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.