జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తెలంగాణలో ప్రత్యేక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని TWJF ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో హైపవర్ కమిటీని పునరుద్ధరించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. జర్నలిస్టుల భద్రత, కేసుల దర్యాప్తును పర్యవేక్షించేలా కమిటీకి అధికారాలు కల్పించాలని కోరారు.