దేశ సేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా, సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించాలని గంగాధరనెల్లూరు మండల బిజేపీ అధ్యక్షులు జి.ఆనందబాబు కోరారు. ముఖ్యమంత్రిగా పదమూడేళ్లు, ప్రధానమంత్రిగా పన్నెండేళ్లుగా ప్రజాసేవలో ఉన్న మోదీకి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయన అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ పిలుపునిచ్చారు.