సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలంటూ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 25న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాల వద్ద, సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. ఓటర్ల జాబితా మార్పులపై స్వతంత్ర సమీక్ష జరగాలని ఆయన డిమాండ్ చేశారు.