రామాయణం చిత్రంలో రావణాసురుడిగా యశ్ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రం నుంచి రావణాసురుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాగాథను నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.