ఉపాధ్యాయుల కేడర్ ఖరారు: జిల్లా, జోనల్ స్థాయిలుగా పోస్టుల విభజన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఉపాధ్యాయుల కేడర్ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. విడుదల చేసిన జీవోల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను జిల్లా, జోనల్ కేడర్లుగా విభజించారు. ఎంపీపీ, జడ్పీ పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లను జిల్లా కేడర్ ఉద్యోగులుగా నిర్దేశించగా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను జోనల్ కేడర్గా ప్రభుత్వం స్పష్టం చేసింది.