తిరుమల అలిపిరి చెక్పోస్ట్ వద్ద త్వరలో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ వ్యవస్థ
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుమల
తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలలో భాగంగా త్వరలో అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు టీటీడీ ఐటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు నాయుడు వెల్లడించారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలతో కూడిన ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు, భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.