పీజీల నియంత్రణ కోసం కొత్త బిల్లు తీసుకురానున్న ఢిల్లీ ప్రభుత్వం
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేయింగ్ గెస్ట్ వసతి గృహాలను క్రమబద్ధీకరించేందుకు 'పీజీ అకామడేషన్ రెగ్యులేషన్ అండ్ సేఫ్టీ బిల్లు-2026'ను తీసుకువస్తోంది. దీని ద్వారా పీజీల నిర్వహణకు తప్పనిసరి లైసెన్సులు, అద్దెల నియంత్రణ, కఠినమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయనున్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.