అమెరికాలో అద్భుతం: అక్టోబర్ 2026 హిందూ హెరిటేజ్ మంత్ గా ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: లాథ్రోప్

అమెరికాలోని లాథ్రోప్ నగరంలో వచ్చే అక్టోబర్ 2026 నెలలను హిందూ హెరిటేజ్ మంత్ గా ప్రకటిస్తూ నగర కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హిందూ సమాజం యొక్క గొప్ప చరిత్ర, సంప్రదాయాలు మరియు సంస్కృతిని గుర్తించి వేడుకగా జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ విశేష కృషితో ఈ చొరవ సాకారమైందని, నగరంలోని హిందూ సంఘాలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయని వారు వెల్లడించారు.