రూ.60 లక్షలతో కల్వర్టు నిర్మాణం పూర్తి: భూమా అఖిల ప్రియ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: నంద్యాల

ఆళ్లగడ్డ నియోజకవర్గం జంబులదిన్నె గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన కల్వర్టు నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి తెలిపారు. గతంలో ఒక మృతదేహాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో వాగు దాటిస్తున్న వైరల్ ఫోటో చూసి తన మనస్సు తీవ్రంగా చలించిందని, అందుకే వెంటనే స్పందించి ఈ శాశ్వత నిర్మాణ పనులను పూర్తి చేయించి ప్రజల కష్టాలను శాశ్వతంగా తొలగించామని ఆమె పేర్కొన్నారు.