బాబర్ ఆజమ్‌కు టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల నష్టపోతున్నామన్న వకార్ యూనిస్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పాకిస్థాన్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం వల్ల అతడి ఆటతీరు దెబ్బతింటుందని మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అద్భుతమైన బ్యాటర్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జట్టును, ఆటగాళ్లను సమర్థంగా నడిపించడంలో బాబర్ ఇబ్బంది పడుతున్నాడని వకార్ స్పష్టం చేశారు.