వరి విత్తనాలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఆదేశాలపై స్పష్టతనిచ్చిన వ్యవసాయ శాఖ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

రాబోయే యాసంగి సీజన్లో వరి విత్తనాల కొనుగోలుకు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అధికారులు భరోసా ఇచ్చారు.