భూమి గురుత్వాకర్షణ శక్తిని జయించవచ్చని మాజీ నాసా ఇంజనీర్ సంచలన ప్రకటన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించే నూతన శక్తిని కనుగొన్నట్లు మాజీ నాసా ఇంజనీర్ చార్లెస్ బుహ్లర్ నేతృత్వంలోని ఎక్సోడస్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ సహాయంతో ఎలాంటి ఇంధనం లేకుండానే వస్తువులను కదిలించే సరికొత్త విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఇది అంతరిక్ష ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక మైలురాయిగా నిలవనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.