బెంగళూరు జైళ్ల శాఖలో కలకలం: నకిలీ పత్రాలతో ఖైదీ విడుదల కేసులో డీఐజీ అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

కర్ణాటకలోని కలబురగి జైళ్ల శాఖ డీఐజీ సోమశేఖర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్గా పనిచేసిన సమయంలో నకిలీ సుప్రీంకోర్టు పత్రాలను సృష్టించి, జీవిత ఖైదీ శంకర్ను అక్రమంగా విడుదల చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. అలాగే ఖైదీ భార్యను లైంగికంగా వేధించినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో, కోర్టు ఆయనను అక్టోబరు తొమ్మిదో తేదీ వరకు పోలీసు కస్టడీకి మంజూరు చేసింది.