రైలు రూపంలో మృత్యువు దూసుకొచ్చి వందలాది గొర్రెలు దుర్మరణం

రిపోర్టర్: హరి స్థలం: Medchal-Malkajgiri

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఔషాపూర్ సమీపంలో రైలు కిందపడి వందలాది గొర్రెలు మృతి చెందాయని రైల్వే అధికారులు తెలిపారు. దక్షణ్ ఎక్స్ప్రెస్ రైలు వెళుతున్న సమయంలో కుక్కల బెదిరింపులతో గొర్రెలు పట్టాలపైకి పరుగులు తీయడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితుడు బాలమోని కిష్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నలభై లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు కోరారు.