ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన అథ్లెట్ ప్రాచి చౌదరి
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య (30) కు చేరిందని, మహిళల 400 మీటర్ల ఫైనల్స్‌లో అథ్లెట్ ప్రాచి చౌదరి కాంస్య పతకం సాధించారని అధికారులు తెలిపారు. ఆమె 53.21 సెకన్ల వ్యవధిలో గమ్యస్థానాన్ని చేరి మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరిందని, అలాగే పురుషుల షాట్ పుట్లో తాజిందర్‌పాల్ సింగ్ తూర్ రజత పతకం గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.