సింగరేణి కార్మికులకు దీపావళి కానుక: ఒక్కొక్కరికి లక్ష పది వేల బోనస్

రిపోర్టర్: కృష్ణ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

సింగరేణి కాలరీస్ సంస్థ కార్మికులకు దీపావళి కానుకగా ఒక్కొక్కరికి రూ. 1,10,250 చొప్పున భారీ బోనస్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక పురోగతికి కొంగు బంగారమని ఆయన అభివర్ణించారు. బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులకు దసరా, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.