ఏలూరు కాలేజీ రోడ్డు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన మంత్రి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఏలూరు
ఏలూరు కాలేజీ రోడ్డులో ఏళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ మరియు గుంతల రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. కాలేజీ రోడ్డులో డ్రైనేజీ సమస్య, గుంతలతో కూడిన రోడ్డు కారణంగా స్థానికులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందిని గుర్తించిన మంత్రి కొలుసు పార్థసారథి తక్షణమే చొరవ తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.