యువతకు హెచ్చరిక: కండలు పెంచాలనే అతి ఆలోచన లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

జిమ్లో కండలు పెంచాలనే అతిగా మారిన కోరిక పురుషుల లైంగిక ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య పరిభాషలో దీనిని మజిల్ డిస్మార్ఫియా అంటారు. తమ శరీరం ఎంత బలంగా ఉన్నా ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నామని భావించడం మానసిక సమస్యకు దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ ఆందోళన భాగస్వామితో సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని కెనడియన్ అధ్యయనం తేల్చిచెప్పింది.